పెద్దపల్లి: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఇంచార్జి ఆది మల్లేశం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. చట్ట సభల్లో బిసి రిజర్వేషన్లను 50 శాతంకు పెంచాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி