బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి

తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ ప్రతీక అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో బుధవారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.

தொடர்புடைய செய்தி