జగిత్యాల జిల్లాలో కత్తులతో దాడి ఘటన కలకలం రేపుతోంది. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తన దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డు పెట్టి వ్యాపారం చేస్తున్నాడని యజమాని ప్రశ్నించాడు. దీంతో వాదన పెరిగి గొడవకు దారితీయడంతో ఇరువురు కత్తులతో దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. దాడి చేసుకున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.