జగిత్యాల: కారు దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డులో రామాలయం వెనక పార్క్ చేసి ఉన్న షిఫ్ట్ కార్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం పెట్రోల్ పోసి దహనం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పారు. వినయ్ అనే వ్యక్తి కారును మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అగ్గి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు రెండు లక్షల నష్టం జరిగిందని తెలిపాడు. పోలీసులు ధర్యాప్తు చేపట్టారు

தொடர்புடைய செய்தி