జగిత్యాలలో హోలీ పండగ పూట విషాదం నెలకొంది. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి డీ-64 ఎస్సారెస్పీ కెనాల్లో సాగర్ గౌడ్ (30) అనే యువకుడు గల్లంతయ్యాడు. మిత్రులతో హోలీ ఆడిన అనంతరం కెనాల్ లో స్నానానికి దిగారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా గొల్లపల్లి శివార్లలోని ఎస్సారెస్పీ కేనాల్ లో సాగర్ మృతదేహం లభ్యం అయ్యింది.