జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి పారిపోయారని పేర్కొన్నారు. విగ్రహంను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.