జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొగ శ్రావణి సవాల్ విసిరారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని కమలా నిలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంగ రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.