జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లెలో శనివారం అనుమానంతో భార్య రాజవ్వపై భర్త సాధుల దుర్గయ్య రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య తలకు తీవ్ర గాయాలవడంతో కరీంనగర్ కు చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో భార్య చనిపోతుందనే భయంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య రాజవ్వ కూడా మృతి చెందింది.