జగిత్యాలలోని కొత్తబస్టాండ్ చౌరస్తాలో గల భారత్ పెట్రోల్ బంక్ లో తిమ్మాపూర్ కు చెందిన బస సురేశ్ తన బైక్ లో రూ. 100 పెట్రోల్ పోయించుకున్నారు. కొంతదూరం వెళ్లేసరికి బండి ఆగిపోయింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న సురేశ్, తిరిగి పెట్రోల్ బంకుకు వెళ్లి అడగ్గా మేము సరిగ్గానే పెట్రోల్ పోశామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. తనకు జరిగిన మోసానికి న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.