గుండెపోటుతో ఉపాధ్యాయురాలు స్కూల్లోనే కుప్పకూలారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్లో జరిగింది. టీచర్ అనురాధ లంచ్ విరామం అనంతరం కుర్చీలో కూర్చొని విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఛాతిలో నొప్పి వస్తోందని ఒక్కసారిగా కుప్పకూలారు. హుటాహుటిన ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు.