బుగ్గారం: వంగిపోయిన విద్యుత్ స్థంభం.. తృటిలో తప్పిన ప్రమాదం

బుగ్గారం మండల కేంద్రంలోని డబల్ రోడ్డుపై శనివారం రాత్రి విద్యుత్ స్థంభం వంగిపోయింది. త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై ఈ స్థంభం వంగి పోవడం వలన రోడ్డుకు ఒక ప్రక్క రాకపోకలను నిలిపి వేశారు. 11కెవి వైర్లతో పాటు టౌన్ లైన్ వైర్లు కూడా ఈ స్థంభానికి అమర్చి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నిర్మించిన డ్రైనేజి పనుల నిర్మాణ లోపం వల్లనే ఈస్థంభం వంగి పోయినట్లు తెలుస్తోంది. ఆదివారం మరమ్మత్తులు చేపట్టనున్నారు.

தொடர்புடைய செய்தி