జగిత్యాల నుంచే బీసీ ఉద్యమం

పోరాటాల ఖిల్లా జగిత్యాల నుంచే బీసీ ఉద్యమం కదం తొక్కుతుందని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గులాబీ జెండానే తమ ధైర్యమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్‌ లెక్క తేల్చారని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி