జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన వివాహిత ఎన్నమనేని సుప్రియ (35) దుబాయ్ లో మంగళవారం మృతి చెందింది. రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన సుప్రియకు అంబారీపేట కు చెందిన శ్రీనివాస్ రావుకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా దంపతులు దుబాయ్ లో ఉంటున్నారు. భర్త శ్రీనివాస్ రావు జాబ్ కు వెళ్లగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కూతుళ్ళకు సుప్రియ విగతజీవిగా కనిపించింది