కరీంనగర్: ఢీకొన్న ఆర్టీసీ బస్సు, లారీ, కారు

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

தொடர்புடைய செய்தி