ఎండపల్లి ప్రథమ వ్యవసాయ అధికారిగా మహేష్

ఎండపల్లి నూతన మండల ప్రథమ వ్యవసాయ అధికారిగా కమల్ల మహేష్ గురువారం అధికార బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక కార్యాలయంగా గుల్లకోట రైతువేదికలో రెగ్యులర్ మండల వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో గొడిశెలపేట, కొత్తపేట, గుల్లకోట, వ్యవసాయ విస్తరణ అధికారులు బలిజపెల్లి సందీప్, కళ్యాడపు మౌనిక, పొట్లపెల్లి అలేఖ్య మరియు పలుగ్రామాల రైతులు, నూతన వ్యవసాయ అధికారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி