మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ప్రమీల (58) మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో ఉత్తర ప్రదేశ్ కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఒక కారుకు ప్రమాదం జరిగింది. ప్రమీలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ఇటీవలనే భర్త గుండెపోటుతో మృతి చెందాడు.