ధర్మపురి: మాలల మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలల మహా పాదయాత్ర విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య పిలుపునిచ్చారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మాల మహానాడు అధ్యక్షుడు జేంజీరికాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி