జగిత్యాల జిల్లాలో పురాతన నాణాలు లభ్యం అయ్యాయి. పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామ శివారులో పెద్దగుట్ట వద్ద బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా 20 పురాతన వెండి నాణాలు బయట పడ్డాయి. వెండి నాణాలపై ఉర్దూ భాష ఉంది. నాణాలను పోలీస్, రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు.