కుల గణన సర్వే పేరిట 13 రోజులు ఒంటిపూట బడులు నడపడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లె ప్రమాదం ఉందని ఎస్టియు జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ పేర్కొన్నారు. గొల్లపల్లి మండలంలో స్టేట్ టీచర్స్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్, గుండెల నరేష్ తదితరులు ఉన్నారు.