చొప్పదండి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

చొప్పదండి పట్టణం బీసీ కాలనీకి చెందిన గాజుల కనకలక్ష్మి (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మామిడాల సురేందర్ ఆదివారం తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ తల్లిని చంపి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకుపోయారని కూతురు నాగమణి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

தொடர்புடைய செய்தி