చెట్టు కొమ్మలు కరెంట్ తీగలపై పడుతున్నాయని కొమ్మలు కొట్టే ప్రయత్నంలో ఓ కొమ్మ మెయిన్ విద్యుత్ తీగపై పడి బోయినపల్లి మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన దాసరి నర్సయ్య (58) మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపిన వివరాలు. నర్సయ్య ఇంటి ముందు ఉన్న మునగ చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడుతున్నాయని శనివారం కొమ్మ కొట్టే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అన్నారు.