సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కంది తిరుపతిరెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఈయన చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయనతో పాటుగా పదమూడు మంది డైరెక్టర్లను నియమించారు. వీరు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.