హుస్నాబాద్: విద్యార్థి దశ చాలా కీలకం

చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావీయ్యకూడదని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని విద్యార్థులకు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ నూతన చట్టాలపై హుస్నాబాద్ షీటీమ్ బృందంతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, విద్యార్థి దశ చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు.

தொடர்புடைய செய்தி