అమెరికాలో కాల్పుల కలకలం.. బ్యాంక్‌లో ఇద్దరు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బ్రాండన్‌లో ఉన్న సిటీబ్యాంక్‌ క్యాంపస్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు కారుతో భద్రతా కంచెను ఢీకొట్టి క్యాంపస్‌లోకి ప్రవేశించి, రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి చెందాడు. ఘటన సమయంలో క్యాంపస్‌లో సుమారు 3,200 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி

✕
✕