TG: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను సోమవారం హ్యాక్ చేశారు. హ్యాకింగ్‌ను గుర్తించిన ఐటీ బృందం వెంటనే స్పందించి ఖాతాను పునరుద్ధరించారు. ఈ ఘటన వల్ల విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు, ఎక్స్ సంస్థకు ఫిర్యాదు చేశామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.