ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం చేపట్టే పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం పిలుపునిచ్చింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లకు వ్యతిరేకంగా బంద్ చేపట్టాలని ఏబీవీపీ నిర్ణయించిందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.