AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసే రిలయన్స్ CBG ప్లాంట్ల ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి తెలిపారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో బంజరు భూములు వినియోగంలోకి వస్తాయన్నారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31 వేలు కౌలు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు.