బెంగుళూరులోని నాగరాబావిలో అక్టోబర్ 23వ తేదీన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ట్రాన్స్జెండర్లు, హర్షవర్ధన్ అనే వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు చంద్రలేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు స్పందించి నజియా, సయ్యద్ మౌషీన్ అనే ఇద్దరు ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.