రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులను అలివేలమ్మ (45), ఆదిలక్ష్మమ్మ(65), శాకమ్మ(60)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி