వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన సందెపూడి సాల్మన్ రాజు (35) అనే తెలుగు యువకుడు మృతి చెందారు. ఐదేళ్ల క్రితం ఉద్యోగం కోసం వియత్నాం వెళ్లిన సాల్మన్ రాజు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సాల్మన్ రాజు భౌతికకాయాన్ని శనివారం స్వస్థలానికి తరలించే అవకాశం ఉంది.