అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి: HYD పోలీస్

TG: బాంబు బెదిరింపుల మెయిల్ రావడంతో HYDలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నామని, నిఘా పెంచామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి రూమర్లను నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112కి సమాచారం ఇవ్వాలన్నారు. 24x7 అందుబాటులో ఉంటామని, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி

✕
✕