మస్కట్ తీరంలో వింతగా మెరిసిన అరుదైన పింక్ డాల్ఫిన్లు

ఒమన్‌లోని మస్కట్ సమీపంలోని ఖంటాబ్ బీచ్ వద్ద అరుదైన గులాబీ రంగు డాల్ఫిన్లు కనిపించి పర్యాటకులను ఆశ్చర్యపరిచాయి. ఒమన్ గల్ఫ్ నీలి జలాల్లో ఈ డాల్ఫిన్లు ఈదుతూ కనిపించగా, స్థానికులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని వీడియోల్లో బంధించారు. ఈ సముద్ర క్షీరదాల జాతిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, వాటి విలక్షణమైన రంగు అందరినీ ఆకట్టుకుంటోంది. సహజ ఆవాసంలో ఇలాంటి అరుదైన జీవులను చూడటం పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది.

தொடர்புடைய செய்தி

✕
✕