కుషాయిగూడ పారిశ్రామికవాడలో మూడు రోజుల క్రితం రసాయన పదార్థాలు పేలిన చెత్త కుప్పను తొలగించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చెత్తను తీసే క్రమంలో రసాయన పదార్థాలు పేలే అవకాశం ఉన్నందున జాగ్రత్త చర్యలు పాటిస్తూ చెత్తను తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసు, ఫైర్, బాంబ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ టీం, టీఎస్ఐఏసీ అధికారులు రంగంలో దిగాయి. చివరకు అక్కడ ఏమి లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.