ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ పారిశ్రామికవాడలో ఆదివారం చెత్త తీసుకెళ్లే కార్మికుడు చెత్త తీసి ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్న క్రమములో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఏదో గుర్తుతెలియని వస్తువు పేలడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.