షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కేశంపేట పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య చిలరేగిన వివాదం నేపథ్యంలో నేడు గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ను గృహ నిర్బంధం చేశారు.