షాద్‌నగర్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండల పరిధిలో గల బూర్గుల గ్రామ సమీపంలో కారు, ఆటో ఢీకొన్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. 108 అంబులెన్స్ సహాయంతో వైద్యం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులను తరలించినట్లు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி