మియాపూర్ పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై చందానగర్ వైపు వెళ్తున్న రోషన్ (27) ఎదురుగా వెళ్తున్న టిప్పర్ ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్‌లోనే దుర్మరణం చెందాడు. అంబులెన్స్ డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.