గచ్చిబౌలి కాల్పుల ఘటన.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజీ

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్ వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆదివారం బయటికొచ్చింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ని పట్టుకునేందుకు పబ్‌కి వెళ్లిన పోలీసులు.. అతడ్ని పట్టుకొని బయటకు తీసుకొస్తున్నప్పుడు ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతని వద్ద నుంచి తుపాకీ లాక్కున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను పోలీసులు బయటపెట్టారు.

தொடர்புடைய செய்தி