రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై శుక్రవారం ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తున్న సమయంలో అవుటర్ రింగ్రోడ్ పై ఒకే కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. మంటలు రాగానే వెనకాల ఉన్న వ్యక్తి ముందుగానే దిగి పక్కనకి వెళ్లిపోయాడు. డ్రైవర్ తో పాటు పక్కనే ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలతో బయటికి వచ్చారు. అక్కడే ఉన్న ప్రయాణికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.