ఇటీవల సికింద్రాబాద్ కు వస్తున్న రైలులో బాలికపై నిందితుడు లైంగిక దాడి ఘటనను సోమవారం జాతీయ మహిళా కమిషనర్ తీవ్రంగా ఖండించింది. కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్వర్ డీజీపీ, ఆర్పీఎఫ్ డీజీలకు లేఖ రాశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక తీసుకున్న చర్యలు మూడు రోజులు నివేదిక రూపంలో పంపాలని కోరారు.