రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరిక్రిష్ణారెడ్డి బుధవారం వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన శ్రీనివాస సాగర్, క్రిష్ణవేణి(32) దంపతులు వలస వచ్చి హైదర్షాకోట్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, భార్య చెప్పిన మాట వినటం లేదని ద్వేషంతో నిద్రిస్తున్న ఆమె తలపై సుత్తి కొట్టి చంపేసి పిల్లలను తీసుకుని పీఎస్ లో లొంగిపోయాడు.