కుత్బుల్లాపూర్ పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిషిక కెమికల్ గోడౌన్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మాటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో దూలపల్లిలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.