మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఆదివారం చెక్ పోస్ట్ నుంచి కిష్టాపూర్ వెళ్లే దారిలో ఏక్ మినార్ మసీదు వద్ద గుర్తుతెలియని వాహనం యువకుని ఢీ కొట్టింది. దీంతో యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ లో కృష్ణ (19) గా పోలీసులు గుర్తించారు.