మేడ్చల్: బస్ డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులు దగ్ధం (వీడియో)

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ బస్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి క్షణాల్లో బస్సులు దగ్ధమయ్యాయి. దీంతో డిపోలో పని చేస్తున్న మెకానిక్‌లు, ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி