మేడ్చల్: తనయుడి చేతిలో తండ్రి దారుణ హత్య

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడ్ ప్లస్ మెడికల్ హాలు ముందు దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసి హతమార్చాడు. సుమారు 10-15 కత్తి పోట్లు పొడవటంవతో తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంతోనే తండ్రిపై తనయుడు దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. సికింద్రాబాద్ లాలా పేట కు చెందిన ఆర్ ఎల్ మొగిలి అనే వ్యక్తిని తన కన్న కొడుకు చంపేశాడు.

தொடர்புடைய செய்தி