మేడ్చల్లో ఆదివారం మధ్యాహ్నం సంచలనం రేపిన హత్య కేసుపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ఉమేశ్, రాకేశ్, లక్ష్మణ్ అన్నదమ్ములు. మందుకి బానిసైన ఉమేశ్ వేధింపులు తాళలేక దుబాయ్ పంపుదామని ఇంట్లో అనుకున్నారు. ఆదివారం ఇంట్లో ఉన్న తమ్ముళ్లను బెదిరించడంతో వాళ్లు ఎదురుతిరిగారు. ఉమేశ్ పారిపోయే క్రమంలో నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.