మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేవైఎం, ఎస్ఎఫ్ఎ నాయకులు పాఠశాలలోని కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం స్కూల్ ఫీజు కోసం ప్రిన్సిపల్ వేధించారని విద్యార్థిని అఖిల సూసైడ్ చేసుకుంది. కాగా తన కుటుంబానికి న్యాయం చేయాలని.. శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.