హయత్ నగర్: సెల్ ఫోన్ దుకాణంలో చోరీ

షటర్ పగులకొట్టి సెల్ ఫోన్ దుకాణంలో చోరీ చేసిన సంఘటన హయత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుంట్లూర్ గణేష్ నగర్ లో నివాసం ఉండే సత్యనారాయణ కుంట్లూర్ చౌరస్తాలో సత్య మొబైల్స్ దుకాణం గత 8 నెలలుగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో దుకాణానికి తిరిగి రాగా షట్టర్ తాళాలు పగులకొట్టి ఉన్నాయి. వెంటనే ఆయన దుకాణంలోకి వెళ్లి చూడగా 45వేల విలువైన వస్తువులు, నగదు చోరికి గురైనట్లు గుర్తించారు.

தொடர்புடைய செய்தி