ఎల్బీనగర్: ఫోన్ నంబర్ హ్యాక్ చేసి రూ. 1.35 లక్షలు మాయం

ఫోను నంబర్ హ్యాక్ చేసి క్రెడిట్ కార్డుల్లోని నగదును కొల్లగొట్టిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. హస్తినాపురం నార్త్, కస్తూరి కాలనీకి చెందిన పల్లా వెంకట్ రెడ్డి వాట్సాప్ నెంబర్ కు నకిలీ పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ను ఓపెన్ చేయగానే అతని ఫోన్ హ్యాక్ అయ్యి ఇండస్ ల్యాండ్, ఆర్బీఎల్ క్రిడిట్ కార్డులు నుంచి రూ. 1.35,528 లక్షల నగదు వేరే ఖాతాల్లోకి బదిలీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

தொடர்புடைய செய்தி