కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ నాయికోటి పవన కుమార్ అన్నారు. గురువారం ఆయన సత్యనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కమ్యూనిటీ హాల్ పైఅంతస్తులో రేకుల పైకప్పు మరమ్మతు చేయించాలని అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో చర్చించి మరమ్మతుకు చర్యలు చేపడుతామన్నారు.